మునుగోడు ఏప్రిల్ 18 : మండల పరిధిలోని జమస్తాన్ పల్లి గ్రామంలో సీతారామాంజనేయ స్వామి ఆలయ రెండవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవానికి శుక్రవారం ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం వారిని ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. వారివెంట చండూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ధోటి నారాయణ, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, నాయకులు ఏనుగు రమణారెడ్డి, జాజుల స్వామి గౌడ్, పంతంగి స్వామి గౌడ్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
MK Stalin | అమిత్ షా కాదు.. ఏ షా కూడా తమిళనాడును పాలించలేడు: ఎంకే స్టాలిన్
IPL 2025 | రాజస్థాన్ జట్టులో లుకలుకలు..! కెప్టెన్ శాంసన్, కోచ్ ద్రవిడ్ మధ్య విభేదాలు..?