‘ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి’
ఎన్నికల సమయంలో ఉదయ సముద్రం ప్రాజెక్ట్ నుండి మునుగోడు మండలానికి కాలువ పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తానని, సొంత డబ్బులతోనే పనులు చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇప్పటివరకు ఆ పనులు పూర్తి చేయకపోవడం..
మునుగోడు, ఏప్రిల్ 06 : ఎన్నికల సమయంలో ఉదయ సముద్రం ప్రాజెక్ట్ నుండి మునుగోడు మండలానికి కాలువ పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తానని, సొంత డబ్బులతోనే పనులు చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇప్పటివరకు ఆ పనులు పూర్తి చేయకపోవడం దురదృష్టకరం అన్నారు. సోమవారం మునుగోడులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ మండలాధ్యక్షుడు మందుల సత్యం మాట్లాడారు. రైతుల పక్షాన నిలబడి ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తూ, తొక్కిపట్టి నారా తీస్తామని బెదిరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. మునుగోడును అభివృద్ధి చేయలేని, శివన్నగూడెం ప్రాజెక్ట్ నుండి మునుగోడుకు నీళ్లు అందించలేని రాజగోపాల్ రెడ్డి వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల, ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీశ్, మండల నాయకులు మదనబోయిన పరమేశ్ యాదవ్, సర్పంచ్ నన్నూరి భూపతి రెడ్డి, సర్పంచ్ పొలగోని విజయలక్ష్మి సైదులు గౌడ్, సర్పంచ్ గజ్జల ధనమ్మ బాలరాజ్ గౌడ్, సర్పంచ్ జంగిలి సునీత సాంబయ్య, నల్గొండ అంజి ,మారగోని అంజయ్య, పందుల రవి, దెందే మల్లేష్, లింగస్వామి, జిట్టగొని మల్లేష్, గుర్రాల సురేష్, లోకేష్, కరుణాకర్, పందుల సురేష్, రాంబాబు, యాదగిరి, నరసింహ, ప్రవీణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

