నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ వినూత్నంగా మన ఊరికి – మన ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం మాడ్గులపల్లి మండలం అభంగాపురంలో కార్యక్రమం ప్రారంభించి వీధివీధి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల వరకు అన్ని గ్రామాల్లో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే భగత్ తెలిపారు.
– మాడ్గులపల్లి, మే 12
మాడ్గులపల్లి, మే 12 : మన ఊరికి – మన ఎమ్మెల్యే కార్యక్రమంతో ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. శుక్రవారం మండలంలోని అభంగాపురంలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచందర్‌నాయక్, మండల స్థాయి అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల లోపు మండలంలోని అభంగాపురం నుంచి గుర్రంపోడు వరకు అన్ని గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరవేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, సర్పంచ్ పగిడిపల్లి రామచంద్రయ్య, ఉపసర్పంచ్ జిల్లా శ్రీకాంత్, నిడమనూరు మార్కెట్ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, నిడమనూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాసీం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చేకూరి హనుమంతరావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, బహునూతల నరేందర్, తాటి సత్యపాల్, పిడిగం నాగయ్య, కూరాకుల వెంకటేశ్వర్లు, నాయకులు పెద్దబోయిన శ్రీనివాస్, పెద్దదేవులపల్లి పీఏసీఎస్ చైర్మన్ గుండెబోయిన వెంకన్న, రాంబాబు, సైదిరెడ్డి పాల్గొన్నారు.