హాలియా, జూలై 11 : రైతులకు మూడు గంటలు విద్యుత్ సరిపోతుందని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రైతులు , బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. హాలియాలో 167 జాతీయ రహదారిపై ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆధ్వర్యంలో రైతులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని అన్నారు రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన మనసులో మాటను బయట పెట్టుకున్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి రైతులకు ఏడు గంటలు కరంటు కూడ సక్రమంగా ఇవ్వకుండా రైతులను హరిగోస పెట్టారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందపెడితేనే రాష్ట్రంలో రైతులకు మేలు జరుగుతుందన్నారు. అనంతరం హాలియా ఎస్ఐ క్రాంతికుమార్ వాహనాల రాకపోకలను పునరుద్ధ్దరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, పిడిగం నాగయ్య, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, బీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి పిల్లి అభినయ్ కుమార్, మార్కెట్ డైరెక్టర్ రమావత్ రాజేశ్ నాయక్ పాల్గొన్నారు.
నకిరేకల్ : నకిరేకల్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను రైతులు చెప్పులతో కొట్టారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నకిరేకల్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, నాయకులు మాదగోని నగేశ్ గౌడ్, పెండెం సదానందం, గుర్రం గణేశ్, రాచకొండ వెంకన్న, సామ శ్రీనివాస్‌రెడ్డి, దైదా పరమేశం పాల్గొన్నారు.
కట్టంగూర్ : వ్యవసాయానికి 24 కరంటు వద్దు 3 గంటలు మాత్రమే చాలు అని మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో దహనం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, మార్కెట్ కమిటీ చైర్మన్ పోగుల నర్సింహ, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పాలడుగు హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ గుండగోని రాములు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
చిట్యాల : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం చిట్యాలలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కో మటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు 3 గంటల కరంటు చాలు అని మాట్లాడిన రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ మెండె సైదులు, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, గుండెబోయిన సైదులు, జగిని భిక్షంరెడ్డి, జిట్ట బొందయ్య, దాసరి నర్సింహ పాల్గొన్నారు.
శాలిగౌరారం : మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను మంగళవారం చేశారు.కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మామిడి సర్వయ్య, చామల మహేందర్‌రెడ్డి, గౌర వీరయ్య, బట్ట వీరబాబు, పాక యాదయ్య, చెలకాని కొమరయ్య, చిర్రబోయిన శ్రీనివాస్, బైరు నాగరాజుగౌడ్, శేషరాజుపెల్లి వెంకన్న, రాపాక రాజు, పడాల సత్తయ్య, శ్రీరామదాసు రాజు, తీగల వెంకన్న, కంది మహేశ్ పాల్గొన్నారు.
కేతేపల్లి : మండల కేంద్రంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు మంగళవారం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి మా ట్లాడుతూ రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, నాయకులు కె.సైదిరెడ్డి, కె.రాములు, జె.వెంకన్న పాల్గొన్నారు.
డిండి : మండల కేంద్రంలో రాజీవ్ చౌరస్తా వద్ద రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. కా ర్యక్రమంలో సర్పంచ్ మేకలసాయమ్మాకశయ్య, పట్టణాధ్యక్షుడు గిరమోని శ్రీనివాసులు, కలీం, ఐలేశ్, జైపాల్, మొహినొద్దీన్, రషీద్, బాలయ్య, ప్రమీల పాల్గొన్నారు.
చందంపేట : మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌ను ఎద్దేవా చేయడం, రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరితో మాట్లాడడం దారుణామన్నారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గిరి, లోక్యనాయక్, శివ, శ్రీశైలం, రామకృష్ణ, మున్నయ్య, శంకర్రావు, రమేశ్, శ్యామల్రావు, హన్నా, లచ్చు పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల ఎదుట బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఏస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున, నాయకులు నోముల క్రాంతి, చింతల శంకర్, అరవింద్, నరేశ్‌కుమార్ , శ్రీకాంత్ ,వెంకన్న, వంశీ, ఆంజనేయులు, ప్రసాద్ ,శ్రీశైలం, ఏడుకొండల్ పాల్గొన్నారు.