నిడమనూరు, అక్టోబర్ 13 ః సీఎం కేసీఆర్ పాలనలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆశీర్వదించేందుకే ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధికార ప్రతినిధి, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పిల్లి రాజుయాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం మాట్లాడుతూ అభివృద్ధిలో వెనుకబాటుకు గురైన సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టాకే అభివృద్ధి మొదలైందన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లి పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సలహాదారు బొల్లం రవియాదవ్, నాయకులు బొల్లం సైదులు, ఆదిమల్ల భాస్కర్, వెంపటి పుల్లయ్య, పెదమాం రాజు, జాల మల్లేశ్ పాల్గొన్నారు.