కొండమల్లేపల్లి, జనవరి 18 : దేవరకొండ నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజ్టెలకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. గురువారం హైదరాబాద్లో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా బాలూనాయక్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలోని నక్కలగండి, డిండి ఎత్తిపోతల కింద చేపట్టిన సింగరాజుపల్లి, కిష్టరాయినిపల్లి, శివన్నగూడెం, గొట్టిముక్కల, పెండ్లిపాకల రిజర్వాయర్లకు నిధులు కేటాయించాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన డిప్యూటి సీఎం త్వరలో పెండింగ్ ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.