మిర్యాలగూడ, నవంబర్ 23 : రాష్ట్రంలోని పేదలందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పట్టణానికి చెందిన నేలపట్ల యాదగిరికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.4 లక్షల ఎల్ఓసీని బుధవారం అతడి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమంతో పాటు వారి ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు జంజిరాల నాగరాజు, యాదగిరి ఉన్నారు.
ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
మిర్యాలగూడ రూరల్ : మండలంలోని కురియా తండాలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చింతరెడ్డి శ్రీవాస్‌రెడ్డి, ధనావత్ చిట్టిబాబు నాయక్, సర్పంచ్ సూర్యానాయక్, సైదానాయక్, శ్రీనునాయక్, స్థానికులు పాల్గొన్నారు.