అడవిదేవులపల్లి, జూలై 7: రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉండాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్తో కలిసి పోడు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పోడు భూములకు పట్టాలు ఇచ్చామన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
మండల వ్యాప్తంగా 125మందికి ప్రభుత్వం జారీ చేసిన పోడు భూముల పట్టాలు అందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ చెన్నయ్య, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్, జడ్పీటీసీ కుర్ర సేవ్యానాయక్, మాజీ ఎంపీపీ కూరాకుల మంగమ్మ, పార్టీ మండలాధ్యక్షుడు కూరాకుల చినరామయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కొత్త మర్రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు షేక్ బాబ్జాని, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీను, నాయకులు బండి వెంకటేశ్వర్లు, గురవయ్య, ముత్యాలు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు మెంబ ర్లు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
సీఎం కేసీఆర్ సారు గిరిజనులకు పోడు పట్టాలు అందించడం గొప్ప విషయం. మేము మా తాత ముత్తాతల నుంచి పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్నాం. మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాకు పోడు పట్టాలిచ్చి ఆదుకుంది. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు రైతుబంధు సాయం అందించడం హర్షనీయం. ఎన్నటి నుంచో ఎదురుచూస్తున్న పోడు భూములకు ప్రస్తుతం పట్టాలు ఇవ్వడం రైతుల పాలిట ఒక వరం.
– పాలోతు శ్రీధర్, లబ్ధిదారుడు, మొల్కచర్ల