మిర్యాలగూడ, ఏప్రిల్ 18 : రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మంగళవారం వేములపల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 100 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక్క మన రాష్ట్రంలోనే పంట పెట్టుబడి కింద ఎకరాకు రూ.10 వేలు, రైతు ఆకస్మిక మృతి చెందితే ఆ కుటుంబానికి రైతుబీమా పథకం కింద రూ.5 లక్షలు ఇచ్చి రైతులకు అండగా నిలుస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో అద్భుత పథకాల ద్వారా పేదలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో గండ్ర రాము, ముక్క అమ్మయ్య, కొమ్ము దేవయ్య, బయ్య అనిల్, వీరయ్య, ఉత్తెర్ల నాగరాజు, సైదులు, శీలం సురేశ్, రంగయ్య, మధు, పిల్లి నాగరాజు, ఆదిత్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, యువ నాయకుడు నల్లమోతు సిద్ధార్థ, సర్పంచ్ దొంతిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ నంద్యాల శ్రీరాంరెడ్డి, తరి సైదులు, సందెనబోయిన చంద్రయ్య, సైదులు, ఇసాక్, వెంకటేశ్వర్లు, జగన్ పాల్గొన్నారు.