MLA Mandula Samuel | ‘నిన్నమొన్న వచ్చిన లీడర్లు కాంగ్రెస్ టికెట్ తీసుకొని ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యిర్రు. కార్యకర్తలను ఎక్కడ ఇబ్బంది పెట్టినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఆయారాం.. గాయారాంలకు భయపడేది లేదు. తుంగతుర్తిలో తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించా. నా పిలుపు మేరకు మందుల సామేల్ను గెలిచిపించిన కార్యకర్తలు, అభిమానులకు క్షమాపణ చెబుతున్నా’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలు చేశారని తెలిసిందే. ఈ క్రమంలో అదే రేంజ్లో రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ కౌంటర్ అటాక్ చేశారు.
ఎమ్మెల్యే మందుల సామేల్ మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించినందుకు నా క్యాడర్ బాధపడుతోందన్నారు. రాజగోపాల్ పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చాడు. రాజగోపాల్ కంటే నేనే కాంగ్రెస్లోకి ముందు వచ్చాను. మునుగోడులో నా క్యాడర్ కూడా ఉంది. నా నియోజకవర్గంకు వచ్చి మంత్రి కోమటిరెడ్డి నాకు ఒక్క మాట చెప్పరా..? నా నియోజకవర్గ రోడ్డు పరిశీలించి నాకు మాట కూడా చెప్పలేదు. నాకు రెడ్లు ఓటేసారు, రాజగోపాల్ రెడ్డికి మాదిగలు ఓటేసారు.. రెడ్లు, దళితులతోనే రాజ్యం నడవదు. నాకు టిక్కెట్ ఇచ్చేది ఏఐసీసీ.. రాజగోపాల్ రెడ్డి కాదంటూ చురకలించారు.
మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించినందుకు నా క్యాడర్ బాధపడుతోంది
రాజగోపాల్ రెడ్డికి మందుల సామేల్ కౌంటర్
రాజగోపాల్ పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చాడు
రాజగోపాల్ కంటే నేనే కాంగ్రెస్ లోకి ముందు వచ్చాను
మునుగోడులో నా క్యాడర్ కూడా ఉంది
నా నియోజకవర్గంకు వచ్చి మంత్రి కోమటిరెడ్డి… https://t.co/EOkgeW4EtF pic.twitter.com/uMuuHKVHhD
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2026