చౌటుప్పల్, ఏప్రిల్ 4 : మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేరుస్తున్నది. అందులో భాగంగా త్వరలోనే ఇక్కడ 100 పడకల దవాఖాన ఈ ప్రాంత ంలో ఏర్పాటు కానుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.36 కోట్లు కేటాయించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఉత్తర్వుల కాపీని కూడా అందుకున్నారు. త్వరలోనే ఎక్కడా ఏర్పా టు చేయాలనేది నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ దవాఖాన అందుబాటులోకి వస్తే 24 గంటల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కాగా 100 పడకల దవాఖాన మంజూరు చేయడంపై ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.