ఆలేరు, అక్టోబర్ 22 : ఈనెల 29న ఆలేరులో జరిగే సీఎం ఆశీర్వాద సభకు ప్రజలు ఉప్పెనలా తరలిరావాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కోరారు. ఆదివారం సభ స్థలం వద్ద ఏర్పాట్లను ఆమె పరిశీలించి మాట్లాడారు. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించిన దమ్మున్న నాయకుడు సీఎం నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఆలేరులో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ జెండా ఎగురవేద్దామన్నారు.
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గ్రూపు తగాదాలతో సిగపట్లు పడుతుంటే క్యాడర్లో తీవ్ర నైరాశ్యం నెలకొందని చెప్పారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారాన్ని రెండు విడతలుగా చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలేరులో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించేందుకు సీఎం కేసీఆర్ 29న ఆలేరుకు వస్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరిగిందన్నారు. ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ వస్పర్ శంకరయ్య, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశ్‌గౌడ్, కౌన్సిలర్ రాయపురం నరసింహులు, బేతి రాములు, కందుల శ్రీకాంత్, ఆలేరు మారెట్ కమిటీ వైస్ చైర్మన్ మోత్కుపల్లి జ్యోతి, పోరెడ్డి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పత్తి వెంకటేశ్, సంపత్, ఆడెపు బాలస్వామి, మొరిగాడి వెంకటేశ్ పాల్గొన్నారు.