నల్లగొండ : దళితబంధు పథకం అద్భుతమైన ఆలోచన అని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కనగల్ మండలం చెట్ల చెన్నారం గ్రామానికి చెందిన దళితులకు దళిత బంధు స్కీమ్ కింద మంజూరైన వివిధ వాహనాలను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..దళిత బంధు పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు. ఎవరు కూడా సాహసించిన విధంగా సీఎం కేసీఆర్ ఆలోచించి దళితుల అభివృద్ధి కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. దళిత సోదరులంతా ఈ పథకాన్ని సక్రమంగా వినియోగించుకుని తమ ఆర్థిక స్థితిని పెంచుకోవాలని కోరారు.
కార్యక్రమంలో ఎంపీపీ కరీం పాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు అయిత గోని యాదయ్య, రామగిరి శ్రీధర్ రావు, స్థానిక, సర్పంచ్, గన్నేబోయిన గంగమ్మ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.