వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం
లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.
- మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, జనవరి 19 : లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని వర్షిత ఆస్పత్రిలో లయన్స్క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ, మలక్పేట యశోద ఆస్పత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని లయన్స్క్లబ్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సామాజికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పేదలకు మరిన్ని సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా ఉచిత క్యాన్సర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేశారు. కార్యక్రమంలో లయన్స్క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షుడు కర్నాటి రమేశ్, ఆస్పత్రి ఎండీ కూటాల రాంబాబు, లయన్స్క్లబ్ కార్యదర్శి లింగయ్య, కోశాధికారి బాబూరావు, సీనియర్ లయన్స్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ
కొండమల్లేపల్లి : దేవరకొండ లయన్స్ ఆధ్వర్యంలో జీఎస్టీ జిల్లా కో ఆర్డినేటర్ పీజేఎం లయన్ దశరథ జెల్లా ఆర్థిక సాయంతో దేవరకొండలోని సాయిబాబా ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్న 20 మంది పేదలు, వృద్ధులకు లయన్స్ మిత్ర అధ్యక్షుడు అంకం చంద్రమౌళి దుప్పట్ల శుక్రవారం పంపిణీ చేశారు.
కార్యక్రమంలో కార్యదర్శి లయన్ కూరెళ్ల కృష్ణాచారి, కోశాధికారి లయన్ మాకం మహేశ్, ఏలె యాదయ్య, చేరుపల్లి జయలక్ష్మి, మోర ఆశోక్, చిలువేరు శ్రీనివాసులు, పగిడిమర్ర రఘురాములు, భీష్మాచారి, మాదిరెడ్డి సంధ్యారెడ్డి, గాజుల రాజేశ్, శ్యాంసన్, ఆర్. శ్రీనివాసులు, పి. సత్యమూర్తి, ఈ. రాములు, వెంకటేశ్వర్లు పాల్గోన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

