చందంపేట, అక్టోబర్ 30 : మొంత తుపాన్‌తో భారీగా నష్టపోయిన పంటలు, రోడ్లు తెగిపోయిన రోడ్లను త్వరలో మరమ్మతు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని దేవరకొండ ఎమ్మెల్యే నీనావత్ బాలు నాయక్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని కోరుట్ల, కంబాలపల్లి గ్రామాలకు వెళ్లే రోడ్డు తెగిపోవడంతో ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో వర్షాలతో రోడ్లు భారీగా నష్టపోయినట్లు ఆయన తెలిపారు. రోడ్లు తెగిపోవడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు సైతం నిలిచిపోయాయని అన్నారు.
వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులకు వాటి వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు. రెండు రోజులపాటు వివిధ శాఖల అధికారులు పరిశీలించి అంచనా విలువ వేయాలని అధికారులకు సూచించారు. ఆయనంట మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, వెంకటయ్య గౌడ్, తాసిల్దార్ శ్రీధర్ బాబు, ఎంపీడీఓ లక్ష్మి, గిరి, సర్వయ్య, గోవింద్ యాదవ్,దేవరకొండ RDO రమణ రెడ్డి, బాబురావు, భారత్, బాద్య నాయక్ ఉన్నారు.