యాదగిరిగుట్ట, మే28: నెలలుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టడంలేదంటూ రైతులు ఆందోళన చెందుతుంటే మరోవైపు మంత్రులు హడావుడి చేస్తూ కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ ఫొటోలకు పోజులివ్వడంతోనే సరిపోతోంది. ఇటీవల కురిసిన వర్షంతో రైతులు ఆందోళన చెందుతుంటే నెలన్నర దాటిన ఆనంతరం మం త్రులు కొనుగోలు కేంద్రాలను సందర్శించి హడావుడి చేయడమే సరిపోయింది. గురువా రం వంగపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని మం త్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొంగులేటి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌రెడ్డి, అయిలయ్య, వీరేశం సందర్శించారు. అక్కడ రైతుతో మాట్లాడి మమ అనిపించారు. పక్కనే రామాజీపేటలోని గోదాంను పరిశీలించారు. గత నెల 15న ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభించారు.
నెలా పదిహేను రోజు లు దాటినా ధాన్యం కొనుగోళ్లు అంతంత మా త్రమే కొనసాగాయి. కొంత మంది రైతులు నష్టానికే దళారులను విక్రయించారు. మం త్రులు సందర్శించిన కొనుగోలు కేంద్రంలో ఇం కా 32 ధాన్యం కుప్పలు ఉన్నాయి. అంచనా బస్తాలు 10 వేలు ఉండగా మరో 4 వేల క్విం టాళ్ల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్ప టి వరకు రూ.1.74 కోట్లను రైతులకు అందజేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లోకి జమ కాలేదని అధికారులు స్పష్టం చేశారు.