నార్కట్‌పల్లి, ఏప్రిల్ 20 : బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో రూ.16కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, డివైడర్, స్ట్రీట్‌లైట్ పనులకు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీచైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తుందన్నారు. నార్కట్‌పల్లి వై జంక్షన్‌గా ఉంటుందని, రోడ్డు విస్తరణ, డివైడర్, స్ట్రీట్‌లైట్ ఏర్పాటుతో మున్సిపాలిటీ శోభను సంతరించుకుంటుందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిపైనే ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నిరంతరం ధ్యాస ఉంటుందన్నారు. ఎంపీ బడుగుల మాట్లాడుతూ నియోజకవర్గం బాగుంటే చాలు అని కోరుకునే వ్యక్తి చిరుమర్తి లింగయ్య అని కొనియాడారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే 100 కోట్లతో అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు. ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ పేదింటి నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టానని, ఎంపీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత నియోజకవర్గ ప్రజలదేనన్నారు. ప్రాణం ఉన్నంత వరకు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసమే పోరాడుతానని తెలిపారు. రోడ్డు విస్తరణతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతారని తెలిసినా.. పట్టణాభివృద్ధి కోసం పాటుపడుతున్నానని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి సహకారం తో బీఈడీ, జూనియర్ కళాశాలలు మంజూ రు చేసుకున్నామని తెలిపారు. త్వరలో బ్రా హ్మణ వెల్లెంల, ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు పూర్తయి లక్ష ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు. కార్యక్రమంలో షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్, గ్రం థాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.