పెన్‌పహాడ్, అక్టోబరు 7 : సమైక్య పాలనలో పేదలు కూడు, గూడు లేక అల్లాడిపోతే, స్వరాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా సీఎం పాలన కొనసాగిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని దోసపహాడ్, జంగంపడిగలో 100 డబుల్ బెడ్రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాడు కాంగ్రెస్ హయాంలో నాగార్జునసాగర్ కాల్వపై కుంగిన దోసపహాడ్ బ్రిడ్జిని పునర్మించాలని వేడుకున్నా పట్టించుకోలేదని పేర్కొన్నారు. దోసపహాడ్ ప్రజల కోరిక మేరకు మొదటిసారి తాను ఎమ్మెల్యేగా గెలువగానే ఏడేండ్ల సమస్య అయిన దోసపహాడ్ బ్రిడ్జిని ఏడు నెలల్లోనే నిర్మించి గ్రామస్తులకు అంకితం చేసినట్లు గుర్తుచేశారు. ఈ సందర్భంగా జై జగదీషన్న.. జై కేసీఆర్ అంటూ ఈలలు, కేరింతలతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. అభిమానులు ఉత్సాహంగా మంత్రిని తమ భుజస్కందాలపై మోసుకుంటూ ఆయనపై పూల వర్షం కురిపించారు. దోసపహాడ్ సర్పంచ్ దొంగరి సుధాకర్, ఆయన కుమారుడు బీఆర్ఎస్ మండలాద్యక్షుడు దొంగరి యుగంధర్, ఎంపీటీసీ గద్దల నాగరాజు, మాజీ సర్పంచ్‌లు, అఖిలపక్ష నాయకులు కలిసికట్టుగా రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు ఊరు బాగు కోసం జెండాలతో సాధించేది లేదని, అభివృద్ధి చేసే మీ లాంటి నాయకులు ఉంటే చాలని పేర్కొనడంతో తన గుండె తరుక్కుపోయిందని మంత్రి గ్రామస్తుల ముందట ఆనందభాష్పాలు రాల్చారు. పార్టీ జెండాలు పక్కన పెట్టి అభివృద్ధి ఎజెండా పాలన అందిస్తున్న గులాబీ పార్టీపై చేపడుతున్న ఆదరణ వచ్చే ఎన్నికలో చూపిస్తామని తెలుపడంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య, పీఏసీఎస్ చైర్మన్లు వెన్న సీతారాంరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, సర్పంచ్‌లు బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, చెన్ను శ్రీనివాస్‌రెడ్డి, బిట్టు నాగేశ్వర్రావు, మీసాల రమణ, ఉప సర్పంచ్ కొండేటి రాంబాబు, ఎల్లంల జగన్, విద్యాసాగర్, సద్దల యాదగిరి, కాసీం, పర్వతం నాగయ్య, కడమంచి నాగయ్య, దుర్గయ్య, మల్లయ్య, విజయ్, నాగేశ్ పాల్గొన్నారు.
మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు..
పెన్‌పహాడ్ : ‘మూడు రంగులు, కాషాయ జెండాలు వద్దు.. అభివృద్ధి చేసే గులాబీ జెండానే ముద్దు’ అంటూ మండలంలోని అనాజిపురం ప్రతిపక్షాల నాయకులంతా ఏకమై విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి మద్దతుగా సర్పంచ్ చెన్ను శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం రాత్రి దోసపహాడ్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల శంకుస్థాపన కోసం వెళ్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డిని అనాజిపురం క్రాస్ రోడ్డు నుంచి మంత్రికి మద్దతుగా రాబోయే ఎన్నికలో హ్యాట్రిక్ విజయం సాధించాలని బైక్‌ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్, బీజేపీ నాయకులు రంజాన్, వెంకన్న, పర్వతం సతీశ్, దేవయ్య, మధు, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, భిక్షం, జానీతోపాటు మరో 85 మంది కార్యకర్తలకు మంత్రి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.