అర్వపల్లి, జూన్ 19 : ప్రతి రోజు ఉదయం, సాయంత్రం చేసే యోగాతో మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం, ఆయుఃప్రమాణం పెరుగుతుందని అర్వపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ భూక్య నగేశ్ అన్నారు. గురువారం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన యోగా సాధనలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య ఆశ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక అరోగ్య అధికారి మాలోతు బిచ్చునాయక్, సూపర్వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీసర్ సునీత, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.