తుంగతుర్తి, ఫిబ్రవరి 13 : తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కొత్తగూడెంకి చెందిన పగిడోజు రంగయ్య (66) రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని కెనాల్ దగ్గర ఉపాధి హామీ పని చేస్తుండగా అస్వస్థతకు గురై మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.