గట్టుప్పల్, సెప్టెంబర్ 24 : అక్టోబర్ 3న గట్టుప్పల్ మండల కేంద్రంలో నిర్వహించే దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఈ.ఎల్.వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ కోరారు. బుధవారం మండల కేంద్రంలో దసరా ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను నేటి యువతరానికి మరింతగా తెలిసేలా దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఈ వేడుక నిర్వహిస్తున్నామన్నారు. గట్టుప్పల్ మండల కేంద్రంలో నిర్వహించే వేడుకకు ఉమ్మడి నల్లగొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, బెంగళూరు నుండి కూడా ప్రజలు హాజరవుతారన్నారు. వేడుకకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గొరిగ సత్తయ్య, ఈ.ఎల్.వి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.