మిర్యాలగూడ, ఆగస్టు 5: మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కోరారు. శనివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ప్రాంత డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలోనే మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ అతిపెద్దదని, ఇక్కడ జిల్లా ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.
మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్నగర్ నియోజకవర్గాలను కలిపి జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా మిర్యాలగూడకు మెడికల్ కళాశాలను కేటాయించాలని, దామరచర్ల నుంచి యాదాద్రి పవర్‌ప్లాంట్‌కు వెళ్లే రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని విన్నవించారు.