నేరేడుచర్ల, జూలై 12 : జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో అత్యుత్తమ మార్కులతో ఐఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులను శనివారం నేరేడుచర్లలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా గుండ్రెడ్డి సైదిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతిభను ప్రోత్సహించేందుకు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మద్దతుగా నిలవడమే లయన్స్ క్లబ్ లక్ష్యం అన్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీఎస్ఈ సీటు పొందిన బట్టు ఆశ్రితవల్లి, ఐఐటీ మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ సీటు పొందిన రమావతి సుకుమార్, ఐఐటీ బాసరలో సీటు పొందిన జడ్పీహెచ్ఎస్ పెంచికల్‌దిన్నె పాఠశాలకు చెందిన సద్దల గీతికను ప్రత్యేకంగా అభినందించారు.
నిరుపేద కుటుంబానికి చెందిన గీతికకు లయన్స్ క్లబ్ తరఫున రూ.8 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ బట్టు మధు, చల్లా ప్రభాకర్ రెడ్డి, జడ్పీహెచ్ఎస్ పెంచికల్ దిన్నె హెచ్ఎం ఎల్.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కార్యదర్శి షేక్ యూసుఫ్, కోశాధికారి సరికొప్పుల నాగేశ్వరరావు, సభ్యులు పోరెడ్డి శ్రీరామ్ రెడ్డి, కందిబండ శ్రీనివాస్ రావు, గుండా సత్యనారాయణ పాల్గొన్నారు.