– మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి, బీఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్ధార్థ
మిర్యాలగూడ, ఫిబ్రవరి 02 : స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని 29వ వార్డు మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థి డబ్బికార్ మల్లేష్‌కు మద్దతుగా సోమవారం భారీ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి, బీఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్ధార్థ పాల్గొని ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా జులకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే సమర్థవంతమైన నాయకుడు డబ్బికార్ మల్లేష్ అన్నారు. 29వ వార్డు అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా తమ పోరాటం సాగుతోందని తెలిపారు.
యువనేత సిద్ధార్థ మాట్లాడుతూ.. బంగారుగడ్డ (29వ వార్డు) సమగ్ర అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అన్నారు. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల్లో మిత్రపక్షాల అభ్యర్థి డబ్బికార్ మల్లేష్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల ఆశీర్వాదంతో ఈ ఎన్నికల్లో మిత్రపక్షాల అభ్యర్థి ఘనవిజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

BRS&CPM : ‘మిర్యాలగూడలో బీఆర్ఎస్, సీపీఎం అభ్యర్థులను గెలిపిద్దాం’