కోదాడ టౌన్, ఏప్రిల్ 24 : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ గురువారం కోదాడ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఉగ్రదాడుల్లో మరణించి వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్.రామకృష్ణ మాట్లాడుతూ.. అకారణంగా అమాయక టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి జరపడం అంతా ఖండించాలని కోరారు. ప్రశాంత జమ్మూకశ్మీర్‌లో పెరిగిన టూరిజంను దెబ్బతీయడానికి ఉగ్ర మూకలు వికృతంగా వ్యహరించారన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉయ్యాల నర్సయ్య, జాయింట్ సెక్రటరీ నయీమ్, కోశాధికారి కోడూరు వెంకటేశ్వరరావు, లైబ్రరీ సెక్రటరీ బండారు రమేశ్, సీనియర్ న్యాయవాదులు మేకల వెంకటరావు, పాలేటి నాగేశ్వరరావు, వేజల్ల రంగారావు, రంజాన్ పాషా, శరత్ బాబు, ఈదుల కృష్ణయ్య, రామిరెడ్డి, గట్ల నర్సింహారావు, బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, వి.ధనలక్ష్మి, హుస్సేన్, సామ నవీన్, ఎస్వీ చలం, కె.మురళి, కరీం, ఎం.రాజారాం, ఎం.రామకృష్ణ, ముల్క వెంకట్‌రెడ్డి, దావీదు, నాగుల్ మీరా, హేమలత, బెల్లంకొండ గోవర్ధన్, పెద్దబ్బాయ్, రాజు, కె.శరత్ కుమార్ పాల్గొన్నారు.