మత సామరస్యానికి ప్రతీక కోదాడ : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
మత సామరస్యానికి ప్రతీక కోదాడ అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. రంజాన్‌ను పురస్కరించుకుని శనివారం కోదాడ పట్టణ పరిధిలోని సారాంశంపేట ఈద్గా వద్ద ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కోదాడ, మార్చి 21 : మత సామరస్యానికి ప్రతీక కోదాడ అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. రంజాన్‌ను పురస్కరించుకుని శనివారం కోదాడ పట్టణ పరిధిలోని సారాంశంపేట ఈద్గా వద్ద ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లింలు, హిందువులు పరస్పరం గౌరవించుకుంటూ కలిసిమెలిసి జీవిస్తారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ముస్లిం మైనార్టీలకు కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మసీదులను పునరుద్ధరించడమే కాక మౌలానాలకు వేతనాలు పెంచిన ఘనత కూడా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని కొనియాడారు.
మున్సిపల్ చైర్పర్సన్ కుసుమ వెంకటరత్నం బాబు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి, కమిషనర్ రమాదేవి డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్ చీమ నరేశ్, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు యర్నేని వెంకటరత్నం బాబు, మహబూబ్ జానీ, జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ వంగవీటి రామారావు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీమ్, మామిడి రామారావు, కరీముల్లా, కందుల కోటేశ్వరరావు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మత సామరస్యానికి ప్రతీక కోదాడ : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

