తుర్కపల్లి, జూన్ 21: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఆరేండ్లు పూర్తయిన సందర్భంగా శనివారం మండలకేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఫ్లెక్సీకి మండల బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ శ్యాగర్ల పరమేశ్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. సీమాంధ్ర పాలనలో తెలంగాణ ప్రాంతం పూర్తి నిర్లక్ష్యానికి గురై సాగు, తాగునీరు లేక ప్రజలు వలసవెళ్లే పరిస్థితి ఉండేదన్నారు.
స్వరాష్టంలో నాటి సీఎం కేసీఆర్ ప్రజల కష్టాలను తొలగించాలనే సంకల్పంతో మూడేండ్ల వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చారన్నా రు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలో రికార్డుస్థాయిలో రైతులు ధాన్యాన్ని పండించి దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపారన్నా రు. కేసీఆర్‌కు వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేకనే సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరంపై విషం చిమ్ము తూ.. రైతుల పొలాలు ఎండబెడుతున్నారని, తక్షణమే గోదావరి జలాలు వదిలి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పలుగుల నవీన్‌కుమార్, జాలిగాం కృష్ణ, నాయకులు భాస్కర్‌నాయక్, రాజేశ్, సాయి, కనకయ్య, వెంకటేశ్, భాస్కర్, భిక్షపతి తదితరులున్నారు.