రాజాపేట, మార్చి 20 : తెలంగాణలో కరువు నేల తడపాలని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడిలా ముందు చూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మండు వేసవిలో వాగులు వంకలు సైతం పొంగిపొర్లుతున్నాయి. కెసీఆర్ విజన్ తోనే నేడు కరువు నేలను కాళేశ్వరం జలాలు ముద్దాడుతున్నాయి. కాళేశ్వరం 15 ప్యాకేజీ ద్వారా గంధమల్ల చెరువులో నుండి గోదావరి జలాలు విడుదల చేయడంతో రాజాపేట మండలంలోని పొట్టిమర్రి వాగు బిరబిరా పారుతుంది. గంధమల్ల చెరువు నుండి నీటిని విడుదల చేయడంతో రాజాపేట, యాదగిరిగుట్ట, మోత్కూరు, గుండాల, తుంగతుర్తి, ఆత్మకూరు మండలాలలో ఉన్న చెరువులు, కుంటలు నిండి కళకళలాడనున్నాయి.