Journalists | జీవో 252 సవరణకు డిమాండ్ చేస్తూ చేపట్టిన శాంతియుత నిరసనకు జర్నలిస్టులు భారీగా తరలివచ్చారు. జీవో సవరణకు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, డెస్క్, కేబుల్, ఇండిపెండెంట్ జర్నలిస్టులు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఐక్య నిరసన చేపట్టారు. జీవో 252లో స్పష్టతలేని నిబంధనలను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. ‘మీడియా అక్రిడిటేషన్ కార్డు–మీడియా కార్డు రెండు కార్డుల విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాటిలైట్, కేబుల్ టీవీ ఛానళ్ల అక్రిడిటేషన్లలో భారీ కోతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రిపోర్టర్లు–డెస్క్ జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నమని ఆరోపించారు. పార్ట్‌టైం, ప్రీ లాన్స్, ఇండిపెండెంట్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయంపై నిరసన గళం విప్పారు. చిన్న పత్రికలు, వెబ్ సైట్,డిజిటల్ మీడియా జర్నలిస్ట్ లకు న్యాయం చేయాలని కోరారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్ట్ నాయకులు జిల్లా కలెక్టర్ నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ వినతి పత్రాన్ని ప్రభుత్వానికి పంపిస్తామని హామీ ఇచ్చారు .
ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త దీర్ఘకాలిక ఆందోళనలకు హెచ్చరించారు జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని టీయూడబ్య్లూజే స్పష్టం చేసింది.
Hyderabad Real Estate | హైదరాబాద్ రియల్టీ డౌన్.. 23 శాతం పడిపోయిన ఇండ్ల అమ్మకాలు
పాలమూరు ప్రాణం మీదికొస్తే శంఖారావమే!
Gold Price | ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. తులం ధర 1.42 లక్షలు