నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరినట్లు మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.
సోమవారం మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.
కార్యక్రమంలో ఫైనాన్స్ కమిటీ మెంబర్ జెడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి, ఎంపీటీసీ సిలివేరు విష్ణు, పార్టీ గ్రామ అధ్యక్షుడు నడిమింటి శ్రీను, మల్గిరెడ్డి కృష్ణారెడ్డి, మునుగల నాగిరెడ్డి, వెంకటరెడ్డి, కర్నాటి శివ గౌడ్, చిలివెరు రమేష్, చిలివేరు యాదయ్య, భిక్షం, హరిప్రసాద్, నవీన్, శివ గౌడ్, రాకేష్, స్వామి, జొర్రిగల శ్రీకాంత్, పాల్గొన్నారు.