నల్లగొండ రూరల్, జూన్ 26 : నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో పట్టణంలోని 47 వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు అంబటి నాగరాజు ఆ పార్టీకి రాజీనామా చేసి గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కంచర్ల వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో అందరితో కలిసి పని చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ లక్ష్యంగా పని చేయాలన్నారు. కార్యకర్తల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, సింగర్ రామ్మోహన్, నల్గొండ పట్టణ పార్టీ అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, రంజిత్, అనిల్ నాయక్, జైచందన్ తదితరులు పాల్గొన్నారు.