JOB Mela | మిర్యాలగూడ, మార్చి 3: మిర్యాలగూడ పట్టణంలోని విజేత డిగ్రీ, పీజీ కళాశాలలో ఇవాళ నెవ్లాండ్ ఫర్ ఎంఎస్ఎన్ ల్యాబోరేటరీస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ తెడ్ల ధనుంజయ్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో నెవ్లాండ్ ఫర్ ఎంఎస్ఎన్ ల్యాబోరేటరీస్ ప్రతినిధులు మధుసూదన్, గణేష్‌లు తమ కళాశాలలో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారన్నారు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో మొత్తం 28 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. 11 మంది ఎంపిక కాగా.. వారికి నియామకపత్రాలు అందించడం జరిగిందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాది అవకాశాలు కల్పిస్తూ వారి జీవితాల్లో తమ కళాశాల వెలుగులు నింపుతుందన్నారు ధనుంజయ్. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.
Kerala Man Shot Dead | ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నం.. కాల్పుల్లో కేరళ వ్యక్తి మృతి
KTR | కేటీఆర్ సూచనతో కదిలిన అధికారులు.. రంగనాయక సాగర్ కాలువను సందర్శించిన అధికార యంత్రాంగం
Maoists | మనుగడ ఉండదని.. లొంగిపోయిన 14 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు