చండూరు, జూలై 3: రాష్ట్రంలో కమీషన్లతో పాటు పోలీసు రాజ్యం నడుస్తోందని మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా ఒక్క రూపాయి అభివృద్ధి కూడా జరగలేదన్నారు. గురువారం ఆయన చండూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని బీఆర్ఎస్ నాయకులపై వందల కేసులు పెడుతున్నారన్నారు. చండూరు మాజీ ఎంపీపీ తోకల వెంకన్న ఇల్లు కూల్చి వేశారని, రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
ఏపని కావాలన్నా కమీషన్లు ఇచ్చుకోవాల్సిందే..
రాష్ట్రంలో ఏ పని కావాలన్నా కమీషన్లు ఇచ్చుకోవాల్సిందేనని, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఎమ్మెల్యేలు మంత్రులు నెలనెలా మామూళ్లు తీసుకుంటున్నారన్నారు. తెలంగాణ వచ్చే నాటికి నల్లగొండ జిల్లా అభివృద్ధిలో అఖరున ఉంటే కేసీఆర్ పాలనలో అగ్రస్థానం నిలిచిందని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ పాలనలో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూశామని ప్రస్తుత ఇందిరమ్మ రాజ్యంలో కమీషన్లు తీసుకుంటూ నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఎరువులు, విత్తనాల కోసం రైతులు క్యూలో చెప్పులు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మునిపటి రోజులను గుర్తుకు తెస్తోందని ఆరోపించారు. సన్న ధాన్యానికి బోనస్ లేదు.. రుణమాఫీకి, రైతు భరోసాకు రాంరాం చెప్పారన్నారు. కమీషన్ల కోసం చేసిన పనులకు బిల్లులు ఆపడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందన్నారు.
మంత్రులకు కనీస అవగాహన లేదు
రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డికి వారి శాఖలపై కనీస అవగాహన లేదని, కేవలం ధనార్జనే ధ్యేయంగా శాఖలు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. రివ్యూ మీటింగ్‌లో కనీస అవగాహన లేకుండా మా ట్లాడుతున్న మంత్రులను చూసి ఇదేం మీటిం గ్.. ఇక్కడ మంత్రులు మాత్రమే మాట్లాడితే, మేమెందుకు.. అని వారి పార్టీ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారన్నారు. జిల్లాలో అన్ని రోడ్ల ను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. కానీ జిల్లా మంత్రి రోడ్లకు నిధులు తెచ్చామని కోతలు కోస్తున్నాడన్నారు. ఇప్పటికే జిల్లా ఇన్చార్జి మంత్రులుగా వీరిని తీసివేశారని గుర్తుచేశారు.
సీఎం, మంత్రులు కేసీఆర్‌ను తిట్టడంలోనే పోటీ పడుతున్నారు తప్ప వారు చేసిందేమీలేదని విమర్శించారు. కృష్ణా నదితో పాటు గోదావరి జాలలను సైతం ఆంధ్రా వారికి అప్పగిస్తున్నారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేయడం చేతకాక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతు రాక్షసానందం పొం దుతున్నారన్నారు. ఇలాంటి కేసులను తాము ఎన్నో చూశామని, వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మునుగోడులో అభివృద్ధి శూన్యం
మునుగోడు నియోజకవర్గంలో కూసు కుంట్ల ప్రభాకర్‌రెడ్డి హయాంలో మం జూరు చేయించిన నిధులు తప్ప ఒక్క పైసా కూడా సాధించలేదన్నారు. ఉమ్మ డి నల్లగొండలో అన్న, ఇక్కడ తమ్ముడి కోతలు తప్ప చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తా ము ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ పనులు మంజూరు చేశామని తెలిపా రు.
ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పనులన్నీ బీఆర్ఎస్ సర్కార్ మంజూరు చేసినవేనని, పాతవి తీసి కొత్తవి పెట్ట డం తప్ప కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిందేమీలేదని, ఇందుకు మునుగోడు క్యాం పు కార్యాలయమే ఉదాహరణ అన్నా రు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కంచర్ల భూ పాల్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్వాయి స్రవంతి, కర్నాటి వెంకటేశం, రెగట్టె మల్లికార్జునరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెం కన్న, కౌన్సిర్ కోడి వెంకన్న, పట్టణాధ్యక్షుడు కొత్తపాటి సతీశ్, బొడ్డు సతీశ్, అనిల్‌రావు, సుదర్శన్, గురునాధం, నరేశ్ తదితర నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.