కనగల్, నవంబర్ 04 : కనగల్ మండలం సాగర్ రోడ్ మంచినీళ్లబావి గ్రామంలో కనగల్ మాజీ ఎంపీపీ కరీం పాషా సోదరి రజియా బేగం అనారోగ్యంతో కన్నుమూశారు. మంగళవారం ఆమె భౌతిక కాయాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ నేత చాడ కిషన్ రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మాజీ ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, అభిమన్యు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని యాదయ్య, మాజీ వైస్ ఎంపీపీ రామగిరి శ్రీధర్ రావు, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి, కడారి కృష్ణయ్య, హన్మంతు నాయక్, కార్యదర్శి జొన్నలగడ్డ శేఖర్ రెడ్డి, సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి, అవురేషి శ్రీను, గుండెబోయిన జంగయ్య, ఎర్రమాద వెంకట్ రెడ్డి, ఎర్రబెల్లి నర్సిరెడ్డి, చింతల యాదయ్య, నల్లబోతు యాదగిరి, బోయపల్లి జానయ్య, చెన్నగోని నాగరాజు రజియా బేగం మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.