రామగిరి: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐటీఐ వివిధ ట్రెడ్స్ పూర్తి చేసిన వారికి ఈనెల 24న మోగా జాబ్‌మేళా నిర్వహిస్తు న్నట్లు నల్లగొండ ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సి పాల్ బి.వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీమేథ హైద్రాబాద్, డీఈసీ (దాస్ ఇంజనీరింగ్ కం.లి) ఆధ్వర్యంలో ఉదయం 10:30 నుంచి జరిగే జాబ్‌మేళాకు అర్హులైన ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అదేవిధంగా అప్రెన్షిప్ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. పూర్తి వివరాలకు జూనియర్ అసోసియేట్ అప్రెన్షిప్ ఆఫీసర్ మల్లికార్జున్‌ను సంప్రదించాలని కోరారు. జాబ్మెళా, అప్రెన్షిప్ కోసం వచ్చే విద్యార్థులు అన్ని రకాల ఓరిజినల్ సర్టిఫికె ట్స్, రెండు సెట్ జిరాక్స్, పాస్ ఫొటోలు, ఆధార్ కార్డుతో రావాలన్నారు.