కోదాడ, అక్టోబర్ 15 : మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని యువత ఉన్నత శిఖరాలకు ఎదగాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీం అన్నారు. బుధవారం కలాం జయంతిని పురస్కరించుకుని కోదాడలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నయీం మాట్లాడుతూ.. రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా, విద్యావంతుడిగా అబ్దుల్ కలాం దేశానికి ఎనలేని సేవలందించారని కొనియాడారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన అంచెలంచెలుగా కష్టపడి ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పైడిమరి సత్యబాబు, గోపాల్, హనుమాన్ నాయక్, లలిత, శ్రీనివాస్, అబూబకర్, ఆరీఫ్, చలిగంటి వెంకట్, దస్తగిరి, క్రాంతి, రాజేశ్, సోమేశ్ పాల్గొన్నారు.