భీమదేవరపల్లి, మార్చి 18 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వీర్లగడ్డ తండా గ్రామంలో బుధవారం వరి పొలాలను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు గోన్యా నాయక్, పద్మజ, హనుమకొండ డివిజన్ ఏడీఏ ఆదిరెడ్డి, భీమదేవరపల్లి మండల వ్యవసాయ అధికారి పద్మ సందర్శించారు. వరి పొలాలలో కంకినల్లిని ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
దీని నివారణకు ఫెన్పైరాక్సిమేట్ 5% EC (1 ml / 1 ltr water) లేదా స్పైరోమెసిఫెన్ 22.9% SC (1.5 ml / 1 ltr water) లేదా ప్రొపార్జైట్ 57% EC వర్షాలు తగ్గిన తరువాత పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించారు. మరో పది రోజులలో వచ్చి వరి పొలాలని మరల పరిశీలిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ములుకనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం వ్యవసాయాధికారులు అచ్యుత్ రెడ్డి, స్వామి రావు, ప్రశాంత్, వీర్లగడ్డ తండా గ్రామ సర్పంచ్ గుగ్లోతు పూర్ణిమ, రైతులు పాల్గొన్నారు.