Viral Video | రీల్స్ పిచ్చిలో తండ్రిని గోనె సంచిలో కుక్కి కొరియర్.. బెంగళూరులో షాకింగ్ ఘటన!
Viral Video | రీల్స్ కోసం బెంగళూరు(Bengaluru)లో ఓ కూతురు తన తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడింది. ప్రయాణానికి బస్సు టికెట్లు దొరక్కపోతే పడే ఇబ్బందులను చెప్పడానికి.. తన తండ్రిని గోనె సంచిలో కుక్కి కొరియర్ చేయబోయింది.
Viral Video | రీల్స్ కోసం బెంగళూరు(Bengaluru)లో ఓ కూతురు తన తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడింది. ప్రయాణానికి బస్సు టికెట్లు దొరక్కపోతే పడే ఇబ్బందులను చెప్పడానికి.. తన తండ్రిని గోనె సంచిలో కుక్కి కొరియర్ చేయబోయింది. కానీ గోనె సంచిలో ఏదో కదులుతున్నట్లు సిబ్బంది గమనించడంతో విషయం బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతంలో నివసించే ఓ యువతి.. తన తండ్రిని పెద్ద బస్తాలో కుక్కింది. ఆ తర్వాత బస్తాకు దారం గట్టి.. ఓ ప్రైవేటు కొరియర్ సంస్థకు కాల్ చేసింది. తన వద్దర భారీ పార్సిల్ ఉందని డెలివరీ చేయాలని కోరారు. దీంతో యువతి ఇంటికి చేరుకున్న కొరియర్ సిబ్బంది బస్తాను నేరుగా కొరియర్ ఆఫీసుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో బస్తాలో ఏదో కదులుతున్నట్లు సిబ్బంది గమనించారు. దీంతో ఆఫీసుకు వచ్చాక బస్తాను తెరవాలని యువతిని కోరారు. అందుకు ఆమె నిరాకరించడంతో స్వయంగా సిబ్బంది గోనె సంచిని తెరిచి చూడగా.. అందులో ఓ వ్యక్తి కనిపించాడు.
ఈ వ్యవహారంపై పోలీసులకు కొరియర్ సిబ్బంది సమాచారం అందించారు. కొరియర్ ఆఫీసుకు వచ్చిన పోలీసులు.. గోనె సంచిలోని వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, సదరు యువతిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా.. కేవలం రీల్స్ కోసమే ఈ పనిచేశానని తెలిపింది. దీంతో సదరు కుటుంబానికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు.
ఈ క్రమంలో క్షమాపణలు చెబుతూ యువతి ఓ వీడియో చేసింది. ఉగాది, రంజాన్ వంటి పండుగల సమయంలో బస్సు టికెట్లు తరచుగా అందుబాటులో ఉండవు. ఆ సమయంలో ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేయడానికే ఈ వీడియో చేశానని యువతవి అందులో పేర్కొన్నారు. అందులో సదరు యువతి, ఆమె అత్త, భర్త ఉన్నారు.
రీల్ కోసం తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడిన కూతురు
ప్రయాణానికి బస్సు టికెట్లు దొరకలేదని తండ్రిని ఒక గోనె బస్తాలో కుక్కి, కొరియర్ ఆఫీసుకు తీసుకువచ్చిన కూతురు
అయితే కొరియర్ ఆఫీసులో ఆ బస్తా లోపల ఏదో కదులుతుండటాన్ని గమనించిన అనుమానంతో మూట విప్పి చూసిన సిబ్బంది
ఇదేమిటని ఆ కుటుంబాన్ని… pic.twitter.com/g9v1x3RK5u
— Telugu Scribe (@TeluguScribe) March 18, 2026
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | లేవగానే బ్రష్ చేయకుండానే నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Regina | ప్రేమలో దారుణంగా మోసపోయా,డిప్రెషన్లోకి వెళ్లా.. జీవితంలోని చేదు అనుభవాన్ని బయటపెట్టిన రెజీనా!
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

