మునుగోడు, మే 09 : మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని చండూరు ఆర్డీఓ, మునుగోడు ఇన్చార్జి తాసీల్దార్, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న సర్వే నంబర్ 78లో మర్రివాగును ఆనుకుని ఉన్న పల్లె ప్రకృతి వనం నుండి దుబ్బకాల్వ రోడ్డు వరకు ఉన్న భూమిని ఎమ్మెల్యే పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి సరిపోయే విధంగా ఇక్కడే భూమి కేటాయించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.
స్థల పరిశీలన అనంతరం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులతో స్కూల్ నిర్మాణానికి కావలసిన స్థల సేకరణపై సమీక్ష చేశారు. మండల కేంద్రంలో గల 78 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి లభ్యతకు సంబంధించి రెవెన్యూ అధికారులు సర్వే మ్యాప్ ప్రజెంటేషన్ చేశారు. దీనికి సంబంధించి కొన్ని మార్పులను చేర్పులను ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
MLA Rajagopal Reddy : మునుగోడులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ స్థలం పరిశీలన