నేరేడుచర్ల, ఏప్రిల్ 10 : నేరేడుచర్లలో పౌర సరఫరాల శాఖ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పోలీసులతో కలిసి అంతర్రాష్ట్ర ధాన్యం లారీలను తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ ప్రారంభమై వడ్లు మిల్లులకు రవాణా అవుతున్న సందర్భంగా ఆంధ్రా నుండి ధాన్యం లారీలు తెలంగాణలోకి రాకుండా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ధాన్యం ఎక్కడి నుండి వస్తోంది.. ఏ మిల్లులలు వెళ్తోంది, రైతు పేరు వంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్, ఆర్.సైదులు పాల్గొన్నారు.