నిడమనూరు, ఆగస్టు 16 : అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. నిడమనూరు మండలంలోని జంగాలవారిగూడెంలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవనం, రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలు గూడు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ పథకం ద్వారా చేయూత అదిస్తుందన్నారు.
ఇల్లు మంజూరు కాని వారు ఆందోళన చెందవద్దని, అర్హులైన పేద వారందరికీ ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు యడవల్లి వల్లబ్ రెడ్డి, ముంగి శివమారయ్య, కొండా శ్రీనివాస్ రెడ్డి, నర్సింగ్ విజయ్ కుమార్, రూపని కృష్ణయ్య, షేక్ జానీ పాషా, శిరీషాల యాదగిరి, డీలర్ సైదాచారి పాల్గొన్నారు.