ఉత్తమ్‌కు హోం..వెంకట్‌రెడ్డికి మున్సిపల్
కాంగ్రెస్ సర్కారులో ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన నలమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డికి హోం శాఖ, నల్లగొండ నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మున్సిపల్ శాఖ కేటాయించారు.
- ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు
- సూర్యాపేట జిల్లా నుంచి ఒకరికి, నల్లగొండ జిల్లా నుంచి మరొకరికి దక్కిన అవకాశం
కాంగ్రెస్ సర్కారులో ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన నలమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డికి హోం శాఖ, నల్లగొండ నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మున్సిపల్ శాఖ కేటాయించారు. గురువారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు వీరిద్దరూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి తొలి మంత్రిగా సూర్యాపేట నుంచి గెలిచిన గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి అవకాశం రాగా ఆయన రెండు పర్యాయాలు మినిస్టర్‌గా పనిచేశారు.
సూర్యాపేట, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర మంత్రి వర్గంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రెండు మంత్రి పదవులు వరించాయి. ప్రస్తుతం హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన
నల్లమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డి 1994లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా గెలువగా ఉమ్మడి రాష్ట్రంలో గృహనిర్మాణశాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం రెండోసారి గురువారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
సూర్యాపేట జిల్లా తొండ తిరుమలగిరి మండలం తాటిపాములలో నలమాద పురుషోత్తంరెడ్డి, ఉషాదేవి దంపతులకు జన్మించారు. నేషనల్ డిఫెన్స్ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. అనంతరం సీనియర్ కమర్షియల్ పైలెట్ హోల్డర్ లైసెన్స్ తీసుకొని ఐఏఎఫ్‌లో ఫైటర్ పైలెట్‌గా పనిచేశారు. ఫ్రంట్ లైన్ ఫైటర్ స్కాడ్రన్‌లో ఎం ఐజీ-21, ఎంఐజీ -23 విమానాలు నడిపారు. భారత వైమానిక దళం తరుపున పాకిస్తాన్లో విధులు నిర్వర్తించారు.
తదనంతరం 1994లో కోదాడ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 1999, 2004 రెండుసార్లు, కోదాడ 2009, 2014, 2018, 2023లలో నాలుగు సార్లు హుజూర్నగర్ ఎమ్మెల్యేగా మొత్తం ఆరుసార్లు గెలు పొందారు. 2019లో నల్లగొండ ఎంపీగా బరిలో నిలిచి గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో 610 జీఓ అమలు చైర్మన్‌గా, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఏండేడ్లుకుపైగా పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
యువజన నేత నుంచి రెండో సారి అమాత్యులుగా ..
మంత్రి పదవిని దక్కించుకున్న నల్లగొండ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయం జీవితం ఆరంభించి రాష్ట్ర మంత్రి పదవి బాధ్యతలను నిర్వర్తించారు. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంలకు చెం దిన కోమటిరెడ్డి పాపిరెడ్డి, సుశీలమ్మ దంపతుల కుమారుడు వెంకట్‌రెడ్డి. తొలిసారి 1999లో నల్లగొండ కాంగ్రెస్‌నుంచి ఎమ్మెల్యేగా గెలుపొం దారు. 2014 వరకు వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రి గా పనిచేశారు. 2018లోఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజ యం సాధించడంతో సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌లో మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

