Tenant farmer | గ్రామ సభల్లో కౌలు రైతులను గుర్తించి భూమి ఉన్న రైతులతోపాటుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింప జేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మా అన్నారు. ఇవాళ కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్లో కౌలు రైతుల సంఘం నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కౌలు రైతు సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గ్రామాల్లో కౌలు రైతులను గుర్తించకపోవడంతో ప్రభుత్వం అందించిన బోనస్ డబ్బులు కౌలు రైతులకు దక్కలేదని ఇది చాలా బాధాకరమైన విషయం అన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, పంటల భీమా వంటి సంక్షేమ పథకాలను కౌలు రైతులను గుర్తించి వారికి అందజేయాలన్నారు.
మార్చి 10న దేశవ్యాప్తంగా జరిగే ధర్నా కార్యక్రమాన్ని కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బొల్లు ప్రసాద్, జక్కుల రామారావు, బానోతు నెహ్రూ, బండమీది వెంకన్న, బెజవాడ వెంకటేశ్వర్లు, దొడ్డ వెంకటయ్య, కంబాల శ్రీనివాస్, పాపిరెడ్డి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Kerala Man Shot Dead | ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నం.. కాల్పుల్లో కేరళ వ్యక్తి మృతి
KTR | కేటీఆర్ సూచనతో కదిలిన అధికారులు.. రంగనాయక సాగర్ కాలువను సందర్శించిన అధికార యంత్రాంగం
Maoists | మనుగడ ఉండదని.. లొంగిపోయిన 14 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు