హైదరాబాద్: నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై (NH 65) వాహనాల రద్దీ (Traffic Jam ) నెలకొన్నది. చిట్యాల రైల్వే వంతెన కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో బ్రిడ్జి కింద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి నార్కట్పల్లి వైపు ట్రాఫిక్ జామ్ అయింది. పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.