యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 25: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి సేవలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ పాల్గొన్నారు. గురువా రం స్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బూడిద బిక్షమయ్యగౌడ్, మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశ్‌తో కలిసి స్వామివారి గిరిప్రదక్షిణలో పాల్గొని పాదయాత్రగా కాలినడకన గుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గిరిప్రదక్షిణలో సుమారు 2 వేల మంది పాల్గొనగా వారితో మాట్లాడుతూ హరీశ్‌రావు నడక సాగించారు. ‘జై నారాసింహ జై, లక్ష్మీనారసింహ జై’ అంటూ పాదయాత్ర చేపట్టారు. తెల్లవారుజామున తేలికపాటి వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా గిరిప్రదక్షిణను కొనసాగించారు. అనంతరం స్వయంభూ పం చనారసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యే క పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనానంత రం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు.
దర్శనానంతరం ఆయన కొండకింద బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఇంట్లో అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. సుమారు అరగంట పాటు ఆయన కుటుంబ సభ్యులతో సరదగా గడిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, నార్ముల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ కర్రె కమలమ్మ, సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్‌గౌడ్, మిట్ట వెంకటయ్య, ఆలేరు మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకర్‌గౌడ్, ఆవుల సాయి, ముఖ్యర్ల సతీశ్, అంకం నర్సింహ, మండలాల అధ్యక్షులు సట్టు తిరుమలేశ్, బీసు చందర్‌గౌడ్, పుట్ట మల్లేశ్, జిల్లా నాయకులు వంటేరు సురేశ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీలు తొటకూరి అనురాధ, పల్లా వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచులు తోటకూరి బీరయ్య, మొగిలిపాక రమేశ్, ఆరే మల్లేశ్‌గౌడ్, ఎగ్గిడి కృష్ణ మండలాల పార్టీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.