భూదాన్‌పోచంపల్లి, నవంబర్ 10 : ఇటీవల కురిసిన వర్షాలకు చేనేత కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. చేనేత పనులు సాగక కుటుంబ పోషణ భారంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు మగ్గాల పనులు నడవక, నేసిన వస్త్రాలకు మారెట్లో గిరాకీ లేక, అప్పు ల భారంతో కూరుకొని చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆధునిక మగ్గా లు పూర్తిస్థాయిలో అందడం లేదు. 10 శాతం లబ్ధిదారుడు వీవర్స్ సర్వీసు సెంటర్ ద్వారా చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో ఆధునిక మగ్గాలు అందజేయాల్సి ఉంటుంది. మూడేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా నేటికీ అందలేదని కార్మికులు వాపోతున్నారు. వాన నీరు గుంత మగ్గాల్లో చేరితే ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. అర్హులైన చేనేత కార్మికులందరికీ ఆధునిక మగ్గాలు అందజేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లి, కొయ్యలగూడెం, నారాయణపురం, పుట్టపాక గట్టుప్పల, సిరిపురం ఎల్లంకి, భువనగిరి, ఆలేరు, జనగాం, బచ్చన్నపేట గ్రామాల్లోని వేలాదిమంది చేనేత కార్మికులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.లక్షలోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించి 13 నెలలు గడుస్తున్నా నేటికీ రుణమాఫీ అమలుకు నోచుకోక వడ్డీ భారం పెరుగుతోందని కార్మికులు వాపోతున్నారు. రూ.లక్షకు పైగా రుణం తీసుకున్న వారు ఆపై మొత్తాన్ని జూలై నెలాఖరులోగా చెల్లిస్తే వారందరికీ రుణమాఫీ అవుతుందని అధికారులు చెప్పడంతో చాలామంది అప్పు తెచ్చి రుణం చెల్లించారు. రుణమాఫీ అమలు కాకపోవడంతో కార్మికుల ఖాతాలోంచి మూడు నెలల వడ్డీని కట్ చేసుకున్నారు. మరోవైపు బయట తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. గతేడాది సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో జాతీయ చేనేత సాంకేతిక సంస్థ (ఎన్ఐహెచ్టీ) ప్రారంభోత్సవం సందర్భంగా చేనే త కార్మికులకు రూ.లక్ష లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రుణమాఫీకి సంబంధించిన జీవో 56ను జారీ చేసింది. 2025-26 బడ్జెట్ నుంచి 33 కోట్లు మం జూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 13 నెలలు గడిచినా చేనేత రుణమాఫీ అమలుకు నోచుకోలేదు. రుణమాఫీకి సంబంధించిన డబ్బులు కేటాయించలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా 2017 ఏప్రిల్ 1 నుంచి, 2024 మార్చి 31 వరకు, కార్మికులు తీసుకున్న రూ.లక్షలోపు రుణాలను రుణమాఫీ చేయనున్నది. యాదాద్రి జిల్లాలో వివిధ బ్యాంకుల్లో రూ. లక్షలోపు తీసుకున్న 2,380 మంది కార్మికులకు19.25 కోట్ల రుణమాఫీ జరగనున్నది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో423 మంది కార్మికులకు నాలుగు కోట్ల రుణమాఫీ లబ్ధి చేకూరనున్నది. ఉమ్మడి జిల్లాలో 2,803 మం దికి రూ.23.25 కోట్ల మేర మాఫీ కానున్నది.
పోచంపల్లి కెనరా బ్యాంకులో రెండేళ్ల క్రితం రూ.రెండు లక్షల రుణం తీసుకున్నా. నెల నెల కిస్తీ చెల్లించినా రూ. 1.23,000 లక్షల బకాయి ఉన్నది. రూ.లక్ష లోపు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో బంగారం అమ్మి 23,500 చెల్లించా. నేటికీ రూ.లక్ష రుణమాఫీ కాలేదు. మూడు నెలల వడ్డీ కింద బ్యాంకు నుంచి అధికారులు ఫోన్ చేసి రూ. 3000 కట్టాలని చెప్పారు. నా దగ్గర డబ్బుల్లేవని చెప్పా. ఓడీ నుంచి డబ్బులు తీసుకొని ఖాతా నుంచి రూ.3వేలు కట్ చేశారు.
ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించి ఏడాది గడిచింది. ప్రభుత్వం నిధులు వెంటనే విడుదల చేసి, రుణమాఫీ అమలు చేయాలి. రూ.లక్షకు పైగా రుణం ఉన్నవారు అప్పు తెచ్చి బ్యాంకులో కట్టారు. చేనేత రుణమాఫీ కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.లక్ష రుణం తీసుకున్న 2,380 మంది చేనేత కార్మికుల జాబితాను ఆగస్టులోనే రాష్ట్ర కమిటీకి పంపించాం. రుణమాఫీకి సం బంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కార్మికుల ఖాతాలో డబ్బు జమ చేస్తాం.