శాలిగౌరారం/నకిరేకల్/చివ్వెంల/సూర్యాపేట టౌన్/తిరుమలగిరి/అర్వపల్లి/మోటకొండూర్ ఏప్రిల్ 13 : ఉమ్మడి జిల్లాలో ఆదివారం సాయంత్రం పలుచోట్ల వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. మామిడి కాయలు నేలరాలాయి. చేతికొచ్చిన వరి పంటలకు నష్టం కలిగింది. నకిరేకల్, శాలిగౌరారం, చివ్వెంల, సూర్యాపేట, తిరుమలగిరి, అర్వపల్లి, మోటకొండూరు తదితర మండలాల్లో కురిసిన వడగండ్ల వర్షం ప్రజలు, రైతులకు తీవ్ర నష్టం కలిగించింది.