చండూరు, జనవరి 01 : బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయపల్లి రమేశ్ గౌడ్ రూపొందించిన న్యూ ఇయర్ వాల్ పోస్టర్లను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలోనైనా రాష్ట్ర ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టాలని, ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యలను తీర్చే దిశగా ఆలోచన చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భవనం శ్రీనివాస్‌రెడ్డి, దాడి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.