Anganwadi Teachers | మిర్యాలగూడ, మార్చి 4 : రాష్ట్రంలో అంగన్వాడి టీచర్లు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లు గౌతంరెడ్డి, అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొందు పార్వతిలు అన్నారు.
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు ఇవాళ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాకు తరలివెళ్తుండగా.. పట్టణ పోలీసులు వారిని ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటివరకు పరిష్కరించడకుండా మోసం చేస్తుందన్నారు.
మినీ అంగన్వాడి టీచర్లకు గత పది నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అర్హులైన మినీ అంగన్వాడి టీచర్లుకు పదోన్నతులు కల్పించాలని, న్యాయమైన హామీలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడిలు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
మీడియాకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం : హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు
Madhabi Puri Buch | సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
AC Bus Shelter | బోరబండలో ఏసీ బస్ షెల్టర్ కబ్జా.. కిరాయికి ఇవ్వటానికి రెడీస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు