కట్టంగూర్, ఆగస్టు 09 : రైతులకు సాగు నీరందించడమే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్ డీ49 నుండి నకిరేకల్, కేతేపల్లి మండలాల్లోని చెరువులను నింపేందుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్ మండలాల్లోని వ్యవసాయరంగానికి నీరందించేందుకు రిజర్వాయర్ నుండి 200 క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగా లిఫ్ట్ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు చెప్పారు.
రైతులు అధికారులకు సహకరించి సాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. అనంతరం ఈదులూరులో కంఠమహేశ్వరస్వామి పండుగలో పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి, నీటిపారుదల ఇరిగేషన్ డీఈ భూషణాచారి, ఏఈలు పాండు, చందన, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, మాజీ సర్పంచ్ బెజవాడ సైదులు, చౌగోని సాయిలు, అయితగోని నారాయణ, గాదగోని కొండయ్య, ఎడ్ల పెదరాములు. నంద్యాల వెంకట్ రెడ్డి, చౌగోని రవి, మర్రి రాజు, ముక్కాముల శేఖర్ పాల్గొన్నారు.